English   

ఆర్ఎక్స్ 100.. రేటింగ్స్ తో బుల్లితెర బ‌ద్ద‌లైపోయిందిగా..

record trp for rx 100 movie in television breaks nani nagarjuna devadas movie
2019-01-06 09:56:59

అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్స్ లో బాగా ఆడతాయి కానీ టీవీలో మాత్రం అవి అంతగా పర్ఫార్మ్ చేయవు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు దీనికి నిదర్శనం. ఈ సినిమా థియేటర్స్ లో ఎంత ఆడినా కూడా టీవీలోకి వచ్చేసరికి రేటింగ్స్ పరంగా చాలా తక్కువగా వ‌చ్చింది. ఒక్కోసారి సిల్వ‌ర్ స్క్రీన్ పై రికార్డు సృష్టించిన సినిమాలు కూడా టీవీల్లోకి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తుంటాయి. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లాంటి సినిమాలు టీవీలో సరిగ్గా ఆడలేదంటే నమ్మడం సాధ్యం కాదు. అలాంటిది ఇప్పుడు ఓ చిన్న సినిమా సిల్వర్ స్క్రీన్ తో పాటు బుల్లితెర పై కూడా సంచలనాలు సృష్టించింది. అదే ఆర్ఎక్స్ 100. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం 12 కోట్లకు పైగా వసూలు చేసి నిర్మాతల పంట పండించింది.
కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు అజ‌య్ భూపతి తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పుడు చిన్నితెరపై వచ్చింది. చాలావరకు అడల్ట్ సీన్స్ కోత పెట్టుకుని వచ్చిన ఆర్ఎక్స్ 100 టీవీలో కూడా దుమ్ము దులిపేసింది. ఎవరు ఊహించని విధంగా 11.1 టిఆర్పీతో సంచలనం సృష్టించింది. ఈ సినిమా వచ్చిన రోజే దేవదాస్ కూడా టీవీల్లో వచ్చింది. నాగార్జున, నాని లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా ఆ సినిమా కంటే ఆర్ఎక్స్ 100కే ఓటేశారు ప్రేక్షకులు. దేవదాసు కేవలం 7.3 రేటింగ్ తో స‌రిపెట్టుకుంటే.. అదే సమయంలో ఆర్ఎక్స్ 100 మాత్రం 11.1 రేటింగ్ తో రచ్చ చేసింది. దీన్నిబట్టి ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై కూడా అంతే మాయ చేసిందని అర్ధ‌మైపోతుంది.

More Related Stories