English   

ఆరెక్స్ 100 హిందీ రీమేక్ కి రంగం సిద్దం !

Tara-Sutaria
2019-03-29 11:23:29

గత ఏడాది తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి సంచలన విజయం సాదించింది ఆరెక్స్ 100 మూవీ. తొలుత చిన్న సినిమాగా మొదలయిన ఈ సినిమా ఎక్కడ టెక్నికల్ పరంగా తగ్గకుండా ఉండడం కొత్త అంశాన్ని హైలైట్ చేయడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వర్మ స్కూల్ నుండి వచ్చిన అజయ్ భూపతి ఇది మొదటి సినిమానా అని జనాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ రాబడిని సాధించింది. ఈ సినిమాని హిందీలో నిర్మించేందుకు నిర్మాత సాజిద్ న‌డియావాలా స‌న్నాహాలు చేస్తున్నారట. తెలుగులో కార్తికేయ పోషించిన శివ పాత్ర‌లో సునీల్ శెట్టి కుమారుడు అహ‌న్ న‌టించ‌నున్నాడట, అలాగే ఈ సినిమాని డర్టీ పిక్చర్, బాద్షాహో లాంటి సినిమాలని తెరకెక్కించిన మిల‌న్ లుత్రియా డైరెక్ట్ చేయ‌నున్నాడట. అలాగే తెలుగులో పాయల్ రాజ్ పుత్ పోషించిన ఇందు పాత్రలో బాలీవుడ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 ఫేం తారా సుత‌రియా న‌టించ‌నుందని అంటున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ లో ఉండగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్  మీదకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నారని అంటున్నారు. సినిమాలో రోమాన్స్, యాక్షన్, లవ్ ఇలా చాలా యాంగిల్స్ ఉండడంతో ప్ర‌స్తుతం హీరో హీరోయిన్లు యాక్టింగ్ వర్క్‌షాప్‌ లో పాల్గొంటున్నారట. ఈ చిత్రానికి తడ‌ప్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. త‌డ‌ప్ అంటే లస్ట్ అనే మీనింగ్ వస్తుందట. ఇక తెలుగులో ఈ సినిమా గ్రామీణ నేపధ్యంలో సాగగా ఈ బాలీవుడ్ సినిమా మాత్రం ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో సాగనుందట.

More Related Stories