English   

ఆరెక్స్ 100 అయిపొయింది...ఇక ఆర్డీఎక్స్ !

Payal Rajput's next film launched
2019-03-31 13:21:22

ఆరెక్స్ 100 సినిమాతో కుర్రకారు గుండెల్ని రంపంతో కోసిన పాయల్ రాజ్‌పుత్‌ తొలి చిత్రంలో నెగటివ్ రోల్ తో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఒక్క సినిమాతో పాయల్‌ ఆఫర్లు వెల్లువలా వచ్చినా ఆమె మాత్రం సెలక్టివ్ గానే పాత్రలు ఎంచుకుంటోంది. ఇప్పటికే నాగార్జున ‘మన్మథుడు 2’లోనూ ఒక హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, డిస్కోరాజా చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న, వెంకీ మామ‌లో వెంక‌టేష్‌ తోనూ జోడీ క‌ట్టినుంది. ఇక ఇప్పుడు పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్క‌నున్న ఆర్‌డీఎక్స్ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది.

శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌ధ‌న్ మ్యూజిక్ అందించ‌నున్నారు. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా లేడీ ఒరిఎంటేడ్ మూవీ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా ఈరోజు మంగళగిరిలోని కె.ఎల్.యూనివర్సిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజ‌య‌వాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంక‌న్న, ఆంధ‌ప్రదేశ్ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

More Related Stories