English   

హిందీ ఆరెక్స్ 100లో కూడా పాయలే ఇందూనా ?

payal
2019-04-14 11:46:01

ఆర్జీవీ దగ్గర ఒకటి రెండు సినిమాలకి పనిచేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరో హీరోయిన్లుగా తెలుగులో గత ఏడాది తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి హిట్ అయిన సినిమా ఆర్ ఎక్స్ 100. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారట. ఈ చిత్రంతో సునీల్ శెట్టి కుమారుడు అహన్ హీరోగా పరిచయం కాబోతున్నాడని సమాచారం. సాజిద్ నదియాద్వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినిమా ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గత ఏడాదిలోనే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.  సాజిద్ నడియావాలా నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీని మిలన్ లూథ్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే అతి త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుందట. ఇప్పటికే సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి హీరో మూవీతో బాలీవుడ్ తెరకు పరిచయం కాగా ఇప్పడు కొడుకు అహన్ శెట్టి కూడా హిందీ చిత్రసీమలో తన లక్ పరీక్షించుకోనున్నారు. అయితే తెలుగులో పాయల నటించిన ఇందు పాత్ర సినిమాకే హైలైట్. మరి ఈ సినిమాకి ఎవరిని తీసుకుకోనున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. పాయల్ ని కూడా వారు సంప్రదిస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories