English   

మ‌హ‌ర్షి సినిమా క‌లెక్ష‌న్స్.. మ‌హేశ్ బాబు 100 కోట్లు అందుకున్నాడా..? 

Maharshi
2019-06-05 17:47:33

మ‌హేశ్ బాబు మ‌హ‌ర్షి సినిమా క‌లెక్ష‌న్ల‌పై ముందు నుంచి ర‌చ్చ న‌డుస్తూనే ఉంది. వ‌చ్చిన దానికంటే ఎక్కువ చెబుతున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ గా నిర్మాత‌లు మాత్రం త‌మ సినిమా 200 కోట్లు దాటేసింద‌నే చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు 27 రోజుల క‌లెక్ష‌న్లు బ‌య‌టికి వ‌చ్చాయి. ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించ‌లేదు కానీ మ‌హేశ్ బాబు కెరీర్లో మాత్రం బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అయింది. శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను సృష్టించిన రికార్డుల‌ను మ‌హ‌ర్షి దాటేసాడు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 101 కోట్ల షేర్ వ‌సూలు చేసి మ‌హేశ్ బాబు కెరీర్లో తొలి 100 కోట్ల సినిమాగా నిలిచింది. నైజాంలో అత్య‌ధికంగా 29 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సీడెడ్‌లో 9.98 కోట్లు.. ఉత్త‌రాంధ్ర‌లో 12 కోట్లు.. ఈస్ట్ 7,15 కోట్లు.. వెస్ట్ 5.60 కోట్లు.. కృష్ణ జిల్లాలో 6 కోట్లు.. గుంటూరులో 7.60 కోట్లు.. నెల్లూరులో 2.75 కోట్లు వ‌సూలు చేసింది. 

తెలంగాణ‌, ఏపీల్లో క‌లిపి ఈ చిత్రం దాదాపు 80 కోట్లు తీసుకొచ్చింది. ఇక్క‌డ సినిమాను 77 కోట్ల‌కు అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ అయి మ‌రో మూడు కోట్లు లాభం తీసుకొచ్చాడు మ‌హ‌ర్షి. ప్ర‌మోష‌న్స్ బాగా చేయ‌డంతో పాటు దిల్ రాజు కూడా ఈ చిత్రానికి వెన్నుముక‌లా నిల‌బ‌డ్డాడు. అనుక్ష‌ణం త‌మ సినిమా రికార్డులు సృష్టించింది అంటూ తొలిరోజు నుంచే ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లాడు. ఇదే సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసింది. తొలి రోజు వ‌చ్చిన టాక్ ప్ర‌కారం చూస్తే ఈ చిత్రం క‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ ఫ్లాప్ అవుతుంద‌నుకున్నారు కానీ చివ‌రికి నిల‌బ‌డి మ‌హేశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. అయితే ఎంత తీసుకొచ్చినా ఓవ‌ర్సీస్, సీడెడ్ ఏరియాల్లో మాత్రం మ‌హ‌ర్షి దారుణంగా బోల్తా కొట్టింది. 

More Related Stories