English   

పోలీస్ గెటప్ లో రచ్చ రేపిన ఆరెక్స్ 100 బ్యూటీ 

Payal rajput
2019-07-03 18:20:31

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుట్ ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకి యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ దెబ్బకు ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం సినిమాలు చాలా సెలెక్ట్ డ్ గా చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లోను అవకాశాన్ని దక్కించుకుంది. కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమా దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. 90లలో స్టూవర్ట్ పురం గజదొంగ గా జనాన్ని భయపెట్టిన టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు జీవిత చరిత్రగా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమాలో వేశ్య పాత్రలో పాయల్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మరో పక్క వెంకటేష్ కి జోడీగా వెంకీమామ సినిమాలో రొమాన్స్ చేయబోతుంది. ఇంకో వైపు మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజా, అలాగే లేడీ ఒరియాంటెడ్ సినిమాగా వస్తున్న ఆర్డీఎక్స్ లవ్ అనే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తుంది. అయితే ఈ అమ్మడు పోలీస్ గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. న్యూ బిగినింగ్, మరో కొత్త తెలుగు సినిమాలో నటిస్తున్నా ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో ఐపీఎస్ గా, నా కెరీర్ లోనే స్ట్రాంగ్ రోల్ పోషిస్తున్నా, నెర్వస్ గా ఉంది. మీ ఆశీస్సులు కావాలి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. ఈ సినిమాలో పాయల్ సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా నటించానున్నదని సమాచారం. 

More Related Stories