100 మంది పిల్లలను దత్తత తీసుకున్న సాయి ధరమ్ తేజ్..

దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఎప్పట్నుంచో ఉన్నా కూడా శ్రీమంతుడు సినిమా నుంచి బాగా ఎక్కువైపోయింది. అప్పట్నుంచే మన హీరోలు కూడా దత్తత అనే మాటలను బాగా అలవాటు చేసుకుంటున్నారు. చాలా మంది కోట్లు సంపాదిస్తుంటారు కానీ అందులో కాస్త పంచడానికి మాత్రం మనసు రాదు. కానీ తాను ఆ టైప్ కాదంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ మెగా మేనల్లుడు మంచి మనసు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా 100 మంది పిల్లలను దత్తత తీసుకున్నాడు ఈయన. ఈ మధ్యే చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్నాడు సాయి తేజ్. దీనికి ముందు ఆయనకు అరడజన్ ఫ్లాపులున్నాయి. ఇక ఇప్పుడు మారుతి సినిమా ప్రతీరోజు పండగేతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవలోనూ ముందున్నాడు ఈయన. ఆ మధ్య ఓ వికలాంగుడికి క్రీడల్లో ఆర్థిక సాయం అందించాడు సాయి. ఇక ఇప్పుడు మున్నిగూడలోని అక్షరాలయం స్కూల్‌ను దత్తత తీసుకున్నాడు. ఇది జరిగి కూడా రెండేళ్లవుతుంది. కానీ ఎవరికీ తెలియదు. ఇక ఇప్పుడు తన పాఠశాలకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నందుకు.. అక్కడున్న పిల్లల బాగోగులు చూసుకుంటున్నందుకు `థింక్ పీస్` అనే స్వచ్ఛంద సంస్థ సాయికి కృతజ్ఞతలు తెలిపింది. వాళ్ళతోనే కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాడు తేజ్. అప్పట్లో చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో గెలిచిన మొత్తం కూడా ఈ పాఠశాలకే ఖర్చు చేసాడు సాయి ధరమ్ తేజ్.