English   

సంపూకి కోపం తెప్పించిన ఆరెక్స్ 100 కార్తికేయ 

 Sampoornesh Babu
2019-07-22 18:12:29

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొబ్బరిమట్ట సినిమా నాలుగేళ్ల క్రితమే మొదలయినప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆగస్ట్ 2న విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విషయంలో తాజాగా ఓ వివాదం రాజుకుంది. అదేంటంటే కొబ్బరిమట్ట సినిమాలోని ఓ సాంగ్ ని ఆరెక్స్ 100 మూవీ హీరో కార్తికేయ హీరోగా నటించిన హిప్పీ సినిమాలో వాడుకున్నారని ఈ సినిమా నిర్మాత సాయి రాజేశ్, హీరో సంపూలు ఆ హీరో మీద ఫైర్ అయ్యారు. నిజానికి కార్తికేయ హీరోగా నటించిన ‘హిప్పీ’లో ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఒక సన్నివేశం ఉంది. అదేంటంటే హీరో థియేటర్‌ లో కొబ్బరిమట్ట సినిమా చూస్తూ నవ్వుతున్నట్టు వెనుక నుంచి వచ్చినాయన 25 సార్లు చూసినా నవ్వు రావడం లేదు. నీకెలా వస్తుందని ప్రశ్నిస్తాడు. అన్ని సార్లు చూస్తున్నారు మీరెవరని అడిగితే ఈ సినిమా నిర్మాతనని బదులిస్తాడు. అయితే అసలు రిలీజ్ కాని సినిమాని ఇలా హేళన చేయడం బాలేదని పేర్కొన్న రాజేష్, ఈ సీన్‌ను పెట్టినందుకు దర్శకుడిని నేను విమర్శించదలుచుకోలేదని, కానీ ఈ సన్నివేశాన్ని రాసిన రైటర్‌తో పాటు మీకు తెలియాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీరు మీ తోటి నటీనటులను దర్శక,నిర్మాతలను గౌరవించమని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం మీద సపందించిన కార్తికేయ సాయిరాజేశ్‌ సార్‌, సంపూర్ణేశ్‌ అన్నా అయామ్‌ రియల్లీ సారీ! మా టీమ్‌తో పాటు నా తరపున. నిజంగా కొబ్బరిమట్ట విడుదల కాలేదనే విషయం నాకు తెలియదని పేర్కొన్నారు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానని ఆయన ట్వీట్ చేశాడు. కొబ్బరిమట్ట పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నానని కార్తికేయ పేర్కొన్నారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో సంపూర్ణేశ్‌, సాయి రాజేశ్‌లు తమ ట్వీట్స్‌ డిలీట్‌ చేశారు. అయితే సినిమా రిలీజ్ చేసిన ఇన్నిరోజులకి ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేయడం ఏమిటో ? మరి.

More Related Stories