English   

హిందీ ఆర్ఎక్స్ 100 షూటింగ్ మొదలు...హీరో ఎవరంటే ?

 Ahan Shetty
2019-08-06 16:38:44

గత ఏడాది జులైలో తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాదించింది ఆరెక్స్ 100 మూవీ. తొలుత చిన్న సినిమాగా మొదలయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వర్మ శిష్యుడు అజయ్ భూపతికి ఇది మొదటి సినిమానా అని జనాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని హిందీలో నిర్మించేందుకు నిర్మాత సాజిద్ న‌డియావాలా స‌న్నాహాలు చేస్తున్నారని ప్రచారామ్ జరిగిన సంగతి తెలిసిందే. తెలుగులో కార్తికేయ పోషించిన శివ పాత్ర‌లో సునీల్ శెట్టి కుమారుడు అహ‌న్ శెట్టి న‌టించ‌నున్నాడట, అలాగే ఈ సినిమాని డర్టీ పిక్చర్, బాద్షాహో లాంటి సినిమాలని తెరకెక్కించిన మిల‌న్ లుత్రియా డైరెక్ట్ చేయ‌నున్నాడు. తెలుగులో పాయల్ రాజ్ పుత్ పోషించిన ఇందు పాత్రలో బాలీవుడ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 ఫేం తారా సుతారియా న‌టించ‌నుందని సమాచారం. ఈ సినిమాని ఈరోజు బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల సమక్షంలో సౌత్ ముంబై థియేటర్లో నేడు చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి తడ‌ప్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారు. త‌డ‌ప్ అంటే లస్ట్ అనే మీనింగ్ వస్తుందట. ఇక తెలుగులో ఈ సినిమా గ్రామీణ నేపధ్యంలో సాగగా ఈ బాలీవుడ్ సినిమా ఎలా సాగుతుందో చూడాలి.

More Related Stories