English   

పవన్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా..

pk
2020-02-01 04:35:26

పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయడం నిర్మాతలకు ఆనందంగా ఉంది. అభిమానులకు పండగ. కానీ ఆయనకు మాత్రం అవసరం. పవన్ ఇప్పుడు కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నాడు. ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే వాళ్లకు డేట్స్ ఇస్తున్నాడు. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు. పార్టీని నడపాలంటే ఆయనకు డబ్బులు కావాలి. అందుకు ఆయన సినిమాలు చేయాలి. నిర్మాతలకు ఆయన డేట్స్ కావాలి.. డిస్ట్రిబ్యూటర్లకు ఆయన క్రేజ్ తెలుసు.. ఇక్కడ అన్ని ఇంటర్ లింక్ అయి ఉన్నాయి. తనకు తనకు బాగా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. పింక్ సినిమా రీమేక్ లో నటించడానికి దిల్ రాజు ఏకంగా 50 కోట్ల వరకు పారితోషికం ఇచ్చాడని తెలుస్తోంది. అయితే అది డబ్బు రూపంలో కాకుండా షేర్ ఇస్తున్నాడు. దాంతో బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. అన్నింటికిమించి కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్. పని దినాలు తక్కువ కాబట్టి బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుంది.

పవన్ కళ్యాణ్ సినిమా పై ఉన్న క్రేజ్ తో డిస్ట్రిబ్యూటర్లు ఎలాగో భారీ రేటుకు సినిమా కొంటారు. దాంతో మళ్ళీ నిర్మాతలకు లాభాలు ఖాయం. పింక్ రీమేక్ బడ్జెట్ 25 కోట్ల లోపే ఉందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాకు తొలి రోజు అంతకంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. ఎలా చూసుకున్నా కూడా పవన్ సినిమాలు చూస్తే రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుంది. ఇక క్రిష్ సినిమాకు కూడా భారీగానే పారితోషికం అందుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. పైగా ఈ సినిమా స్వాతంత్రానికి పూర్వం జరిగే కథ. దీని కోసం చాలా కష్ట పడాలి. కెరీర్లో తొలిసారి ఇలాంటి పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ రెండు సినిమాలకు కలిపి దాదాపు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలిసి మిగిలిన హీరోలు షాక్ అవుతున్నారు.

More Related Stories