English   

100 ఎకరాల భూమి కొన్న జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్..

rashmi
2020-02-21 06:48:01

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జబర్దస్త్ యాంకర్ తను సంపాదించిన మొత్తం మొత్తంగా భూమిపై పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కాకుండా తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో వంద ఎకరాల భూమిని 5 కోట్లకు బేరం చేసిందని ప్రచారం జరుగుతోంది. దాదాపు 15 సంవత్సరాల కింద ఇండస్ట్రీకి వచ్చిన రష్మి గౌతమ్ చిన్న చిన్న పాత్రలు వేస్తూ గుర్తింపు కోసం చాలా కాలం పాటు వేచి చూసింది. చివరికి జబర్దస్త్ కామెడీ షో నుంచి అనసూయ భరద్వాజ్ కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వడంతో ఆ స్థానంలోకి రష్మి వచ్చింది. అప్పటి నుంచి ఈమె జాతకం మారిపోయింది. అప్పటి వరకూ నువ్వు మాకొద్దు అన్న వాళ్లే ఆ తర్వాత రష్మి గౌతమ్ నువ్వే కావాలి అంటూ ఆమె దగ్గరికి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డబ్బు సంపాదన లక్ష్యంగా ముందుకు వెళుతుంది రష్మీ. నటి అయిన తర్వాత కచ్చితంగా డబ్బులు అయినా సంపాదించుకోవాలి.. లేదంటే పేరు రావాలి.. నాకు రావాల్సిన పేరు వచ్చిందని అనుకుంటున్నాను.. అందుకే డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయిపోయాను అని చెప్పింది రష్మి గౌతమ్. అనుకున్నట్లుగానే ఇప్పటివరకు తాను సంపాదించిన మొత్తాన్ని ఒకేసారి భూమిపై పెట్టేసింది. తాను కొన్న ఈ 100 ఎకరాలలో వ్యవసాయం చేయాలని ఆలోచిస్తుంది ఈ హాట్ యాంకర్. ఈ భూమిలో కోకా, యూకలిప్టస్‌ చెట్లను పండించాలని ప్లాన్ చేసుకుంటోంది ఈ యాంకర్. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో రష్మీ సొంత ఊరైన బెహ్రాంపూర్ అనే ప్రదేశంలో రష్మీ ఈ భూమిని కొనుగోలు చేసిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇన్నాళ్లు సినిమాలు చేసిన రష్మీ ఇప్పుడు వ్యవసాయం పై ఫోకస్ చేస్తుందన్నమాట.

 

More Related Stories