English   

ఆర్‌ఎక్స్‌ 100 సీక్వెల్‌ రెడీ అవుతోందట 

RX 100
2020-04-27 13:57:00

ఆర్ఎక్స్ 100 సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు రాబడి తెచ్చిన ఈ సినిమాలో ఇందుగా నటించిన పాయల్ రాజ్ పుత్ కుర్రకారులో తన ఫాలోయింగ్ పెంచుకుంది. కేవలం ఆమె ఒక్కతే కాదు ఈ సినిమాలో హీరోకి, అలానే దర్శకుడిని మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే హీరో-హీరోయిన్లు కొంచెం గట్టిగానే అవకాశాలు అందుకుని ముందుకు వెళ్తున్నారు. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఒక్కరే సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికీ ఆయన తన సినిమా విషయంలో ఒక క్లారిటీకి రాలేని పరిస్థితి. ఆయన ‘మహా సముద్రం’ పేరుతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. 

ఆ విషయం ఎలా ఉన్నా ఇప్పుడు ఆర్ఎక్స్ 100 సినిమాకి సీక్వెల్ ఉంటుందని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది. నిజానికి పాయల్ హీరోయిన్ గా వచ్చిన ఆర్డిఎక్స్ లవ్ ఆర్ఎక్స్ 100 సినిమాకి సీక్వెల్ అనే ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తెలిపోయిన్దనుకోండి. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన దర్శకుడు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీరో కార్తికేయతో కలిసి అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’కి సీక్వెల్‌ వస్తుందా? అని ఓ నెటిజన్‌ అజయ్‌ని అడిగ్గా.. దానికి ఉంటుందని సమాధానం ఇచ్చారు అజయ్‌. దీంతో మహాసముద్రం పూర్తయ్యాక ‘ఆర్‌ఎక్స్‌ 100’ సీక్వెల్ ఉండచ్చని అంటున్నారు.  

More Related Stories