రజనీకి 100 జరిమానా విధించిన పోలీసులు...ఎందుకంటే

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మొన్న లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ...లాంబోర్గిని కారులో ఫేస్ మాస్కు పెట్టుకుని..సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న ఫొటో ట్విటర్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే రజనీకాంత్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లింది ఎక్కడికనే విషయం వెల్లడయింది. రజనీ కెలంబాక్కమ్ లోని తన ఫాంహౌజ్ కు తన కూతురు అల్లుడితో కలిసి వెళ్లారని తెలుస్తోంది. ఈ ఫాంహౌజ్లో కూతురు సౌందర్య, అల్లుడు విశాగన్ వానంగమూడి, మనవడు వేద్ కృష్ణతో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు కార్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్ బెల్ట్ పెట్డుకోలేదన్న కారణంతో రజనీకాంత్ కు ఫైన్ వేశారు చెన్నై ట్రాఫిక్ పోలీసులు. గత నెల 26 న రజనీకాంత్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని, అందుకు గాను చట్ట ప్రకారం 100 రూపాయలు జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు.