English   

అఖిల్ తో ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ సినిమా

Akhil Akkineni
2021-04-19 11:31:11

అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగానే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ  సినిమా నుండి విడుదల చేసిన అఖిల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

ఇక తాజా సమాచారం ప్రకారం అఖిల్ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్  వినిపిస్తోంది. అంతే కాకుండా మైత్రీమూవీ మేకర్స్ అఖిల్ కోసం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతిని సెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే అజయ్ భూపతి అఖిల్ కు లైన్ వినిపించగా అతడు గ్రీన్ సిగ్నల్  ఇచ్చినట్టు టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories