English   

విజయ్ దేవరకొండ తర్వాత ఆర్ఎక్స్ 100 కుర్రాడే..?

Karthikeya
2018-09-03 14:44:15

ఈ యేడాది టాలీవుడ్ కు చాలా కొత్త టాలెంట్ వచ్చింది. యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకూ చాలామంది ప్రూవ్ చేసుకున్నారు. అలా ప్రూవ్ చేసుకున్న వారిలో ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు, హీరో కూడా ఉన్నారు. ముఖ్యంగా హీరో కార్తికేయకు ఈ సినిమా తిరుగులేని బ్రేక్ ఇచ్చింది. అంతకు ముందు మనోడు మిస్టర్ కార్తికేయ అనే సినిమా చేశాడు. కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు. బట్.. ఆర్ఎక్స్  100తో ఓవర్ నైట్ మంచి క్రేజ్ వచ్చింది. అతని పాత్రకే కాదు.. నటనకూ విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. దీంతో కుర్రాడు ఇక ఆ టైప్ సీరియస్ క్యారెక్టర్స్ కు బాగా సూట్ అవుతాడు.. కాబట్టి అవే సెలెక్ట్ చేసుకుంటాడు అంటే మనోడు కేమిడీలు చేస్తా అంటున్నాడు..

ఏ స్టార్ కైనా బ్రేక్ వచ్చిన సినిమాలో క్యారెక్టర్ ను బట్టే ఇమేజ్ వస్తుంది. అలా చూస్తే కార్తికేయకు సీరియస్ టైప్ పాత్రలు బాగా నప్పుతాయి. కానీ అన్నీ అవే చేస్తే కొన్నాళ్లలో కనుమరుగవుతారు. ఈ విషయం కుర్రాడికి బాగా తెలిసినట్టుంది. అందుకే రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. అందుకే ఈ సారి అనూహ్యంగా కామెడీ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాతో కుర్రాడికి.. బంపర్ ఆఫర్ తగిలింది. 

టాలెంట్ ఉంటే కాస్త లేట్ అయినా మంచి ఆఫర్సే వస్తాయి అనడానికి ఈ కార్తికేయ మరో ఎగ్జాంపులు గా నిలిచాడు. తమిళ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన కలైపులి ఎస్ థాను ఈ సినిమా నిర్మిస్తున్నాడు. గతంలో సూర్యతో ‘నువ్వు నేను ప్రేమ’ అనే సెన్సిబుల్ లవ్ స్టోరీ తీసిన దర్శకుడు కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ సినిమా తెరకెక్కుతుందన్నమాట. ఎలాగూ కార్తికేయ చేసిన ఆర్ఎక్స్ 100 తమిళ్ లో రీమేక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనోడికి ఆ రికగ్నిషన్ ఉంటుంది. మొత్తంగా కార్తికేయ లక్ చూస్తే విజయ్ దేవరకొండ తర్వాత అతనే అనిపిస్తుంది.

అతి తక్కువ సినిమాలతో స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కార్తికేయను అప్పుడే స్టార్ అనలేం కానీ.. ఇతనూ కష్టపడే ఎదిగాడు. విజయ్ అర్జున్ రెడ్డిలా కార్తికేయా ఆర్ఎక్స్ 100తో జెన్యూన్ హిట్ కొట్టాడు. మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండలాగే చాలా తక్కువ టైమ్ లోనే తమిళ్ లో తమిళ్ వారితో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు కార్తికేయ కూడా అలాగే. మొత్తంగా విజయ్ దేవరకొండ తర్వాత ఇంత తక్కువ టైమ్ లో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న కుర్రాడు కార్తికేయ అనే చెప్పాలి. మరి ఈ కామెడీ సినిమా అతనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

More Related Stories