English   

ఆర్ఎక్స్ 100 హీరోకు క్రేజ్ కష్టాలు

RX100-karthikeya
2018-09-03 19:42:01

ఆర్ఎక్స్ హండ్రెడ్ తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమాలో కుర్రాడి నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ వస్తున్నా.. ఆచి తూచి స్క్రిప్టులు వేస్తున్నా అంటున్నాడు. ఈ నేపథ్యంలో కార్తికేయకు కొన్ని కొత్త చిక్కులు వచ్చాయి. అతను ఆల్రెడీ నటించిన ఓ సినిమాకు సంబంధించిన వివరాలు లేటెస్ట్ గా కొన్ని న్యూస్ పేపర్స్ లో కనిపించాయి. ఆర్ఎక్స్ హండ్రెడ్ తో క్రేజ్ తెచ్చుకున్న హీరోతో సినిమా అంటూ సదరు చిత్ర నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టగా వచ్చిన వార్తలవి. అయితే వాటి క్లిప్పింగ్స్ ను కట్ చేసి ఈ సినిమాకూ తనకేం సంబంధం లేదని ట్వీట్ చేశాడు కార్తికేయ. అరె అలా ఎలా జరుగుతుందీ అనుకుంటున్నారా..? ఎలా జరిగిందో కూడా చెప్పాడ్లెండీ..

ఈ సినిమా పేరు ‘సుపారి’. ఆర్ఎక్స్ హండ్రెడ్ కంటే ముందు కార్తికేయ ‘చేయాలనుకున్న’ సినిమా. కానీ చేయలేదు. కాకపోతే ఆ దర్శక నిర్మాతలు కొన్ని రోజులు టెస్ట్ షూట్ చేద్దాం అన్నారట. దీంతో ఓకే చెప్పిన కార్తికేయ ఓ వారం రోజుల పాటు టెస్ట్ షూట్ కు వెళ్లాడట. టెస్ట్ షూట్ తర్వాత కొన్ని రోజుల్లో సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారట. కానీ ఇంత వరకూ అతన్ని పిలవలేదు. అంటే తర్వాత సినిమా ఆగిపోయింది. ఇప్పుడు కుర్రాడికి క్రేజ్ వచ్చింది కాబట్టి.. ఆ క్లిప్పింగ్స్ ను వాళ్లు తీస్తోన్న వేరే సినిమాకు వాడుతున్నట్టు ఇతనికి తెలిసింది. దీంతో ఈ నాన్సెన్స్ ఆపండి అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ సంచలనమైంది. నిజానికి క్రేజ్ ను క్యాష్ చేసుకునేవాళ్లు చాలామంది ఉంటారిక్కడ. కానీ ఇలా డెమో షూట్స్ ను కూడా వాడుకుని(కార్తికేయ చెప్పింది నిజమే అయితే).. మరో సినిమాకు యాడ్ చేయాలనుకోవడం దారుణం..  మరి ఈ వ్యవహారంపై సదరు చిత్ర నిర్మాతలు ఏం చెబుతారో చూడాలి. 

More Related Stories