English   

ఆర్ఎక్స్ 100 పాప ఇక యాక్ష‌న్ చేస్తుంద‌ట‌

Payal-Rajput
2018-09-05 16:40:26

ఆర్ఎక్స్ 100.. టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్షేష‌న్.. టాలెంట్ ప్యాక్ తో వ‌చ్చిన ఈ మూవీలో అంద‌రికీ గుర్తింపు వ‌చ్చింది. అయితే సినిమా స‌క్సెస్ లో కంటెంట్ కు ఎంత ఇంపార్టెంట్ ఉందో.. హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ అందాల‌కూ అంతే ఇంపార్టెంట్ ఉంద‌నేది కాద‌న‌లేని నిజం. అస‌లు ఇలాంటి పాత్ర చేయ‌డానికి ఏ హీరోయిన్ ముందుకు రాదు. అది కూడా ఫ‌స్ట్ మూవీతోనే. మొత్తంగా తను డేర్ చేసింది కాబ‌ట్టి ఓవ‌ర్ నైట్ తిరుగులేని గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మ‌డికి ఆ వెంట‌నే అవ‌కాశాలువ‌స్తాయ‌నుకుంటే అలా జ‌ర‌గ‌లేదు. పైగా పెద్ద సినిమాల‌పై ఆశ‌లు పెట్టుకుంది. బ‌ట్ అవేవీ ఫ‌లించ‌లేదు కానీ.. ఈ బోల్డ్ బ్యూటీకి లేటెస్ట్ గా మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చింది.

త‌ను సినిమాల్లో బోల్డ్ కానీ బ‌య‌ట కాద‌ని ఇప్ప‌టికే ఓ నిర్మాత క‌మిట్మెంట్ అడిగాడ‌ని ఆ సంద‌ర్భంగా కాస్త గ‌ట్టిగానే చెప్పింది. దీంతో త‌న‌కు ఆఫ‌ర్స్ కాస్త ఆచితూచి వ‌స్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ భామ‌కు ఓ సినిమా వ‌చ్చింది. భానుకిర‌ణ్ డైరెక్ష‌న్ లో రాబోతోన్న సినిమాలో పాయ‌ల్ ను ప్ర‌ధాన హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆశ్చ‌ర్యంగా ఫ‌స్ట్ మూవీలో బోల్డ్ గా న‌టించిన ఈ భామ ఈ సారి యాక్ష‌న్ స్టంట్స్ చేయ‌బోతోంద‌ట‌. అంటే అందాలార‌బోత నుంచి అంద‌రినీ చిత‌గొట్టే పాత్ర చేయ‌బోతోంద‌న్న‌మాట‌. మ‌రి ఈ మూవీతో త‌న‌కెలాంటి గుర్తింపు వ‌స్తుందో చూడాలి. 

More Related Stories