English   

100 ప‌ర్సెంట్ ల‌వ్ ను చెడ‌గొట్ట‌డం లేదు క‌దా..!

100-Kadhal-Official-Teaser
2018-09-12 16:32:39

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? 100 ప‌ర్సెంట్ ల‌వ్ తెలుగులో మంచి విజ‌యం సాధించింది. నాగ‌చైత‌న్య కెరీర్ కు కావాల్సిన బూస్ట‌ప్ ఇచ్చింది. సుకుమార్ కూడా అర్థ‌మ‌య్యే ప్రేమ‌క‌థ‌నే రాసుకొచ్చాడు. త‌మ‌న్నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ఇది. ఇలా అంద‌రికీ బానే క‌లిసొచ్చిన ఈ సినిమాను ఇప్పుడు త‌మిళ్ లో రీమేక్ చేస్తున్నారు. అక్క‌డ ఎంఎం చంద్ర‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. త‌మిళ‌నాట ఈ చిత్రాన్ని సుకుమార్ నిర్మిస్తుండ‌టం విశేషం. ఇక్క‌డ హిట్టైన ఈ చిత్రం అక్క‌డ కూడా అదే మ్యాజిక్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. జివి ప్ర‌కాశ్ కుమార్, శాలినిపాండే ఇందులో జంట‌గా న‌టిస్తున్నారు.  తాజాగా ఈ చిత్ర 18 సెక‌న్ల టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత 100 ప‌ర్సెంట్ ల‌వ్ ను చెడ‌గొడుతున్నారా ఏంటి అనే అనుమానం వ‌స్తుంది. ఇక్క‌డ చైతూ, త‌మ‌న్నా మ‌ధ్య క‌నిపించిన ఆ కెమిస్ట్రీ అక్క‌డ ప్ర‌కాశ్, శాలిని మ‌ధ్య లేదు. ఏదో మొక్కుబ‌డిగా చేస్తున్న‌ట్లు అనిపించిందే కానీ అస‌లైన కెమిస్ట్రీ మాత్రం కనిపించ‌లేదు. మ‌రి అర‌వోళ్ల‌కు ఈ రొమాంటిక్ కామెడీ ఎంత వ‌ర‌కు ఎక్కుతుందో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతానికి టీజ‌ర్ మాత్రం నిరాశ ప‌రిచింది. అక్టోబ‌ర్ లో సినిమా విడుద‌ల కానుంది. మ‌రి 100 ప‌ర్సెంట్ ల‌వ్ అక్క‌డ 100 ప‌ర్సెంట్ కాద‌ల్ లా ఎంత‌వ‌ర‌కు న్యాయం చేస్తుందో..? అయితే జివి ప్ర‌కాశ్ కుమార్ హీరోగా బాగానే స‌క్సెస్ అవుతున్నాడు.. దాంతో ఈ సినిమా కూడా అత‌డికి మ‌రో హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నారు నిర్మాత‌లు కూడా. 

More Related Stories