English   

టెంప్టింగ్ ఆఫర్స్.. డైలమాలో ఉన్న ఆర్ ఎక్స్ 100 బ్యూటీ

Hottest Beauty Payal Rajput in Dilemma
2018-09-16 07:25:31

ఒకే సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాలో అమ్మడి ఒంపు సొంపులకే కాదు.. తన పర్ఫార్మెన్స్ కు కూడా ఫిదా అయ్యారు ఆడియన్స్. సినిమా సూపర్ హిట్ కూడా కావడంతో తనకు అవకాశాలు వెల్లువెత్తుతాయనుకుంది. కానీ వచ్చే స్క్రిప్ట్ లన్నీ మళ్లీ లిప్ లాక్ ల చుట్టే తిరుగుతున్నాయట. కానీ అవి మళ్లీ మళ్లీ చేయకూడదని ఫిక్స్ అయిందీ బ్యూటీ. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఇంకా ఒక్క ఆఫర్ కూడా రాలేదు. కానీ లేటెస్ట్ గా ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. ఇది కూడా ఓ రైజింగ్ కుర్రాడి సరసన. నిజానికి అతని సరసన తను ఐటమ్ సాంగ్ చేస్తే తనకు పెద్దగా ఉపయోగం ఉంటుందనుకోలేం. కానీ సదరు హీరో తండ్రిగారు అమ్మడి కోసం పట్టుబడుతున్నట్టు టాక్. మరి ఎవరా హీరో అనుకుంటు్న్నారా..?

కెరీర్ ఆరంభం నుంచీ స్టార్ హీరోయిన్లనే నమ్ముకుని సినిమాలు చేస్తూ వస్తోన్న కుర్రాడు బెల్లంకొండ శ్రీనివాస్. దీనివల్ల అతను స్టార్ అనే భ్రమలో కూడా ఉన్నాడంటారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య భారీ బడ్జెట్ తో చేసిన రెండు సినిమాలూ పోవడంతో వెంటనే తగ్గాడు. తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడిప్పుడు. మరి తేజ అంటే తెలుసు కదా.. బడ్జెట్ ఓవర్ ఉండదు.. ఆర్టిస్టులూ ఓవర్ చేయడానికుండదు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ కోసం ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఇందుకోసం తనకు తన ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్(6లక్షలు) కంటే ఐదు రెట్లు ఎక్కువ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని టాక్. ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది. కానీ రెండో సినిమాకే ఐటమ్ గాళ్ గా మారితే ఇక తన కెరీర్ అలాగే సా(ఆ)గి పోతుందనే భయంలో పడిందట పాయల్. కాకపోతే టెంప్టింగ్ రెమ్యూనరేష్ కాబట్టి చేసినా చేయొచ్చంటున్నారు. చేస్తుందా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

More Related Stories