తమిళ్ వాళ్లకు ఆర్ఎక్స్ 100 బ్యూటీ కావాలట

ఆఫర్స్ వస్తాయనే ఆశతో ఫస్ట్ మూవీకే అంతా ఆరబోసింది. సబ్జెక్ట్ డిమాండ్ మేరకు అవసరమైన దానికంటే ఎక్కువే ఎక్స్ పోజింగ్ చేసింది. అంతేనా.. ఏకంగా భారీ లిప్ లాక్ లు, ఇంటిమేట్ సీన్స్ తో రెచ్చిపోయింది. ఒళ్లు దాచుకోకుండా తను పడ్డ కష్టం ఫలించింది. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ అమ్మడి ఆశలు ఫలించేలా లేవు. అవును.. ఆర్ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ అయినా.. అందుకు మేజర్ షేర్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ దే అయినా.. అమ్మడికి రావాల్సినంత క్రేజ్ కానీ ఆఫర్స్ కానీ రాలేదు.. ఆశ్చర్యంగా దర్శకుడు భూపతితో పాటు హీరో కార్తికేయకు వెంటనే ఆఫర్స్ వచ్చాయి. బట్ పాయల్ కు మహా అయితే కొన్ని షాప్ ఓపెనింగ్స్.. మరికొన్ని స్టేజ్ అప్పీరియన్స్ లు వచ్చాయి. ఆ మధ్య కొన్ని ఆఫర్స్ వచ్చాయట.. కానీ మాకేంటీ అని నిర్మాతలు అడిగారనీ.. అందుకే ఆ ఆఫర్స్ రద్దు చేసుకున్నానని చెప్పింది. ఏదేమైనా తెలుగులో కొత్త ఆఫర్స్ పై చాలా ఆశలు పెట్టుకున్న పాయల్ కు కాస్త టైమ్ పట్టినా నిజం తెలిసింది. అందుకే మకాం మార్చేస్తోంది.
తెలుగులో ఆఫర్స్ రావడం లేదనీ ఇక కోలీవుడ్ పై కాన్ సెంట్రేట్ చేసింది పాయల్. లేటెస్ట్ గా అమ్మడికి కోలీవుడ్ లో ఓ ఆఫర్ వచ్చింది. తను స్టార్ గా ఎదగడం కోసం స్టార్ హీరోయిన్లనే తీసుకుని ఓ మోస్తరు విజయాలు సాధించిన హీరో కమ్ ప్రొడ్యూసర్.. ఉదయనిధి స్టాలిన్ సరసన పాయల్ కు ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు ఏంజెల్ అనే టైటిల్ కన్ఫార్మ్ చేశారు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆ ఏంజెల్ పాయల్ కాదు.. తెలుగు నుంచి అక్కడికి వెళ్లి మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన బ్యూటీ బస్టాప్ ఫేమ్ ఆనంది అసలు హీరోయిన్. సో.. మకాం మార్చినా మనసుకు తగ్గ పాత్రలు మాత్రం రావడం లేదీ బ్యూటీకి. మరి నెక్ట్స్ ఎలాంటి స్టెప్ వేస్తుందో చూడాలి.