English   

అర‌వింద స‌మేత నిజంగానే 100 కోట్లు కొట్టేసిందా..?

Aravinda-Sametha
2018-10-29 17:41:52

100 కోట్ల క‌ల ఇప్ప‌టి వ‌ర‌కు బాహుబ‌లి కాకుండా తెలుగు ఇండ‌స్ట్రీలో అందుకున్న‌ది ఇద్ద‌రే ఇద్ద‌రు హీరోలు. ఆ ఇద్ద‌రు కూడా మెగా ఇంట్లోంచి వ‌చ్చిన వాళ్లే. ఒక‌రు చిరంజీవి.. మ‌రొక‌రు రామ్ చ‌ర‌ణ్. తండ్రీ కొడుకులే 100 కోట్ల షేర్ అందుకున్నారు. ఇందులో చిరంజీవి ఖైదీ నెం.150తో ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి 105 కోట్లు వ‌సూలు చేస్తే.. ఈ ఏడాది రంగ‌స్థ‌లంలో 126 కోట్లు వ‌సూలు చేసాడు చ‌ర‌ణ్. ఇక ఇప్పుడు ఈ రెండు రికార్డుల‌పై ఎన్టీఆర్ క‌న్ను ప‌డింది. మెగా కుటుంబానికి త‌ప్ప మ‌రో హీరోకు సాధ్యం కాని ఈ రికార్డు ఇప్పుడు అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ అందుకున్నాడు. మూడు వారాల త‌ర్వాత అర‌వింద స‌మేత 100 కోట్ల షేర్ అందుకుంది. తాజాగా ఈ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. ఇప్ప‌టికే 160 కోట్ల గ్రాస్ కూడా అందుకుంది ఈ చిత్రం. ఓవ‌రాల్ గా త్రివిక్ర‌మ్ స్టామినా.. ఎన్టీఆర్ ఇమేజ్ క‌లిపి చిరంజీవి ఖైదీ నెం.150 రికార్డ్ ఈజీగా ఎగిరిపోయేలా క‌నిపిస్తుంది. అయితే రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం రికార్డ్ మాత్రం చేరుకోవ‌డం క‌ష్ట‌మే. కానీ చిరంజీవి రికార్డు చేరుకునేలా క‌నిపిస్తున్నాడు వీర‌రాఘ‌వ‌. ఇప్ప‌టికే చాలా చోట్ల అర‌వింద స‌మేత ప్ర‌యాణం చివ‌రికి వ‌చ్చేసింది. ఇప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ ఆప‌క‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డా మంచి వ‌సూళ్లే తీసుకొస్తుంది ఈ చిత్రం. ఇక మూడో వారం ముగిసిన త‌ర్వాత స‌వ్య‌సాచి వ‌చ్చిందంటే అర‌వింద స‌మేత పూర్తిగా మాయ‌మైపోవ‌డం ఖాయం. అప్ప‌టి వ‌ర‌కు కూడా వ‌చ్చే క‌లెక్ష‌న్లు రావ‌డానికి ప్ర‌మోష‌న్స్ చేస్తూనే ఉన్నారు టీం. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఖైదీ నెం.150 పేరు మీదున్న 105 కోట్ల మార్క్ అర‌వింద స‌మేత అందుకుంటుందో లేదో చూడాలిక‌.

More Related Stories