English   

టాలీవుడ్ నటుడు కన్నుమూత.. 1000 సినిమాలకు పైగా..

tollywood
2020-03-06 20:12:49

గొల్లపూడి మారుతిరావు, జాన్ కొట్టే.. ఇలా చాలా మంది నటులు తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఈ విషాదాలు మరిచిపోకముందే తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. 1000 సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటుడు జనార్ధన రావు మరణించారు. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని స్వగృహంలో ఈయన మరణించారు. మార్చ్ 6 ఉదయం ఆయన చనిపోయారు. దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆయన. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరితోనూ నటించాడు ఈయన. వాళ్లందరితో కలిసి ఎన్నో వందల సినిమాల్లో నటించారు జనార్ధాన రావు. వెంకటేష్, బాలయ్య, మోహన్ బాబు, చిరంజీవి సహా అందరితోనూ ఈయన స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

నాలుగేళ్ల కింద జనతా గ్యారేజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌‌తో కీలకమైన సన్నివేశంలో నటించారు జనార్ధన రావు. రాజీవ్ కనకాల పనిచేసే గవర్నమెంట్ ఆఫీస్‌లోకి రౌడీలు వచ్చినపుడు ఎన్టీఆర్ మాట్లాడే ముసలాయన ఆయనే. సినిమాలతో పాటు సౌత్ ఇండియాన్ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌లో జాయింట్‌ సెక్రటరీగానూ, కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు జనార్ధన రావు. గుంటూరు జిల్లాలోని పొనిగళ్ల గ్రామం జనార్ధన్‌రావు ఈయన స్వస్థలం. 1000కి తెలుగు సినిమాలతో పాటు, సిరీయల్స్‌లో కూడా నటించారు ఈయన. నాగార్జున జానకి రాముడు, మజ్ను.. మోహన్ బాబు పెదరాయుడు, ఎన్టీఆర్ కొండవీటి సింహం, చిరంజీవి అభిలాష, కోడి రామకృష్ణ అమ్మోరు, శోభన్ బాబు గోరింటాకు లాంటి సినిమాల్లో వివిధ పాత్రల్లో ఆయన కనిపించారు జనార్దన రావు. గోకులంలో సీత, తలంబ్రాలు వంటి టీవీ సిరీయల్స్‌లో నటించారు. ఈయన మరణంపై కొందరు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

 

More Related Stories