English   

మ‌హేష్ మ‌న‌సు దోచిన 106 ఏళ్ళ భామ‌.. 

Mahesh-Babu
2018-11-26 11:20:04

సాధార‌ణంగా అం.టుంటాం క‌దా.. ఆరు నుంచి అర‌వై వ‌ర‌కు అంతా ఆ హీరోను చూస్తుంటే ప‌డిపోతారు అని. ఇలా ఇప్పుడు నిజంగానే మ‌హేష్ బాబు విష‌యంలో జ‌రిగింది. ఈయ‌న‌కు ఫ్యాన్స్ ఎంత‌మందున్నారో చెప్ప‌డం క‌ష్టం. అంతగా పాకిపోయింది మ‌హేష్ బాబు ఇమేజ్.. మార్కెట్.. స్టామినా. ఇక ఇప్పుడు ఈయ‌న‌కు 106 ఏళ్ల బామ్మ ఫ్యాన్ అయిపోయింది. త‌ను ఒక్క‌సారైన మ‌హేష్ బాబును చూడాల‌నేది కోరిక‌. తన హృదయాన్ని అర్థం చేసుకున్న మ‌హేష్ బాబు ప్ర‌త్యేకంగా ఆ బామ్మ‌ను క‌లిసాడు. ఆ 106 ఏళ్ల బామ్మ స‌త్య‌వ‌తి హైద‌రాబాద్ కు వ‌చ్చిన విష‌యం తెలుసుకుని క‌లిసి సంతోషించాడు సూప‌ర్ స్టార్. ఇదే విష‌యం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసాడు మ‌హేష్ బాబు.

ఏళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. కానీ 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. ఆమె తన అభిమానంతో నా హృదయాన్ని గెలుచుకున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రాసుకున్నాడు మ‌హేష్ బాబు. ఈ మ‌ధ్య మ‌న హీరోలు రెగ్యుల‌ర్ గా ఇదే చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన అభిమానుల‌ను వెళ్లి క‌లుస్తున్నారు.. లేదంటే ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా ఇదే చేసాడు. 

More Related Stories