English   

బాలయ్య 107పై అఫీషియల్ అనౌన్స్మెంట్

Balakrishna
2021-06-10 14:53:32

నందమూరి బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కు చేరుకుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైష్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే బాలయ్య గోపిచంద్ తో ఓ సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బాలయ్య బర్త్ డే సందర్బంగా అభిమానులకు గిఫ్ట్ గా సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో త్వరలోనే సింహం గర్జించబోతుందని పేర్కొన్నారు. అఖండ సినిమా తరవాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. బాలయ్య కెరీర్ లో 107వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు చెందిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

More Related Stories