English   

ఆర్ఆర్ఆర్ ముహూర్తానికి 11.11.11నే ఎందుకు..? 

Ram-Charan-NTR
2018-11-12 14:15:46

కేలండ‌ర్ లో ఇన్ని డేట్లు ఉండగా త‌న మ‌ల్టీస్టార‌ర్ కోసం కేవ‌లం 11.11.11నే ఎందుకు రాజ‌మౌళి ఎంచుకున్నాడు..? అది కేవ‌లం ఫ్యాష‌న్ గా ఉంటుంద‌నా లేదంటే ఇంకా ఏమైనా కార‌ణాలున్నాయా..? ఇక్క‌డ మ‌రో విశేషం కూడా ఉంది. స‌రిగ్గా వందేళ్ల కింద అంటే 11.11.1918న మొద‌టి ప్ర‌పంచ యుద్ధం ముగిసింది. స‌రిగ్గా 100 ఏళ్ళ త‌ర్వాత ఇప్పుడు రాజ‌మౌళి త‌న మ‌ల్టీస్టార‌ర్ మొద‌లుపెట్టడం యాదృశ్చికంగా ఉన్నా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన తేదీనే కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప‌లికాడు రాజ‌మౌళి. ఒక‌ప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ మ‌ల్టీస్టార‌ర్స్ చూసిన త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఏ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు రాలేద‌నే చెప్పాలి. మ‌ధ్య‌లో ఎన్ని వ‌చ్చినా కూడా ఆ స్థాయి కాదు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు దాదాపు 100 కోట్ల మార్కెట్ ఉన్న ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ ను క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. దీనికి 11వ నెల 11 గంటల 11 నిముషాలకు ముహూర్తం ఎంపిక చేసుకున్నాడు. 

దానికి కార‌ణం కూడా ఉంది. హీరోలుగా న‌టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. చరణ్ తో పాటు ద‌ర్శ‌కుడు రాజమౌళి జాతక రీత్యా ఈ నాగుల చవితి రోజు చాలా బాగా కలిసి వస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పార‌ని తెలుస్తుంది. అందుకే చవితి నెగిటివ్ సెంటిమెంట్ కూడా ప‌క్క‌న‌బెట్టి మ‌రీ త‌న సినిమాను మొద‌లుపెట్టాడు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు. ఈ సినిమా క‌థ 1920 నేప‌థ్యంలో ఉంటుంద‌ని చాలా రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అందులో నిజం కూడా లేక‌పోలేదు. అయితే కాసేపు మాత్రమే ఈ క‌థ ఉంటుంద‌ని.. ఆ త‌ర్వాత క‌థ ప్ర‌స్తుతానికి సెట్ వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఈ వేడుక‌కు బాలీవుడ్ నుంచి ఎవ‌రూ రాక‌పోవ‌డం ముఖ్యంగా క‌ర‌ణ్ జోహార్ రాక‌పోవ‌డం అనుమానాలకు తావిస్తుంది. ఆయ‌నే ఈ చిత్రాన్ని 180 కోట్ల‌కు బేరం పెట్టారు హిందీలో. ఇదిలా ఉంటే సినిమా క‌చ్చితంగా ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు రాజ‌మౌళి. దీనికి రామ రావ‌ణ రాజ్యం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నాడు. న‌వంబ‌ర్ 19 నుంచి యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. 

More Related Stories