కీర్తి క్రేజ్...ఏకంగా సినిమాకి 11 కోట్లు

కరోనా ప్రభావంతో దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. అలా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ముందు వరుసలో ఉంది. మరో వైపు సినిమా థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ రాకపోవడంతో చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయిందని చెప్పచ్చు. అప్పులు తెచ్చిన చిన్న సినిమాల నిర్మాతలు సినిమాలను డిజిటల్ మీడియాల్లో విడుదల చేసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే హీరో సూర్య సహా మరి కొంతమంది తాము నిర్మించిన సినిమాలను ఓటీటీల్లో విడుదల చేసేశారు. ఈ కోవలోనే కీర్తిసురేశ్ సినిమా పెంగ్విన్ ఓటీటీలో విడుదలవుతుంది. అలాగే ఆమె నటించిన మరో సినిమా మిస్ ఇండియా కూడా ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశాలే ఉక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. వారు ఏకంగా ఈ సినిమాని 11 కోట్లకు కొనుక్కున్నట్టు తెలుస్తోంది. అయితే మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.