English   

జాతిరత్నాలు 11డేస్ కలెక్షన్స్

Jathi Ratnalu
2021-03-24 17:25:15

టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగాయి. ఇక ఆ అంచనాల మధ్య విడుదలైన జాతిరత్నాలు సినిమాకు మొదటి షోతోనే హిట్ టాక్ వచ్చింది. ఇక సినిమా విడుదలై 11 రోజులు అవుతున్న కలెక్షన్స్ జోరు తగ్గటం లేదు. ఈ వారం రిలీజ్ అయ్యిన చిత్రాలు కూడా జాతిరత్నాలు సినిమాను బీట్ చేయలేకపోతున్నాయి. 

ఇక జాతిరత్నాలు 11 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే...సినిమాకు 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 11.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా..మూడు రోజుల్లోనే షేర్ ను రాబట్టింది. ఇక 11 రోజులకు ఏకంగా 33.96 కోట్ల షేర్ ను రాబట్టింది. పదకొండోరోజు కూడా 2.15 షేర్ ను రాబట్టడం విశేషం. ప్రాంతాల వారిగా కలెక్షన్స్ వివరాలు చూసినట్లయితే ఏపీ తెలంగాణలో 28.76 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.రెస్ట్ ఆఫ్ ఇండియా 1.42 కోట్లు, ఓవర్సీస్ 3.78 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అంతే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ గా 33.96 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

More Related Stories