English   

118 సినిమాకు వ‌సూళ్లు పెరుగుతున్నాయంటున్న దిల్ రాజు..

We are hoping '118' will continue to exceed expectations says Dil Raju
2019-03-03 12:56:31

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయంటున్నారు నిర్మాత దిల్ రాజు. నైజాంలో ఈయనే ఈ సినిమాను కొనుక్కున్నాడు. ఆయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ సినిమా మంచి వ‌సూళ్లు సాధిస్తుంది కూడా. రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపు మూడు కోట్ల షేర్ వసూలు చేసింది 118. ఇదే విష‌యాన్ని చెప్పాడు దిల్ రాజు. సినిమాకు టాక్ బాగా ఉందని.. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు అంటున్నాడు ఈయన. కొత్త కథలు వచ్చినప్పుడు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని 118 సినిమా మరోసారి నిరూపించింద‌న్నాడు దిల్ రాజు. అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్ లు వస్తున్నాయని.. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ మంచి విజయం వచ్చింది అంటున్నాడు ఈ నిర్మాత.
మహేష్ కోనేరు నిర్మించిన ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన 118 మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. తొలిరోజు కోటిన్నరకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా దాదాపు రెండు కోట్లు వసూలు చేసింది. 118 సినిమా కావాలంటే 14 కోట్లు వసూలు చేయాలి. ఇప్పట్లో సినిమాలేవీ లేవు.. దానికి తోడు టాక్ కూడా బాగానే ఉంది.. దాంతో ఎలాగోలా కళ్యాణ్ రామ్ లక్ష్యం వైపు అడుగులు వేస్తారని నమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మరి చివరివరకు ఏం జరుగుతుంది అనేది చూడాలిక‌. ప్రస్తుతానికి దిల్ రాజు మాత్రం ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు.

More Related Stories