English   

ప‌డిప‌డి లేచిన మ‌న‌సుకు 12 కోట్లు.. 

Padi-Padi-Leche-Manasu
2018-11-22 06:31:01

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న సినిమా ప‌డిప‌డి లేచే మ‌న‌సు. ఈ చిత్రంపై ముందు నుంచే అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా శ‌ర్వానంద్ ఇప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతుండ‌టం.. సాయిప‌ల్ల‌వి హీరోయిన్ కావ‌డంతో హ‌ను రాఘ‌వ‌పూడి లై డిజాస్ట‌ర్ ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుదల కానుంది. ఇక ఇప్పుడు విడుద‌ల‌కు నెల ముందే ఈ చిత్ర రైట్స్ అన్నీ అమ్ముడైపోయాయి. అది కూడా భారీ రేట్ కు. డిజిట‌ల్, శాటిలైట్, డ‌బ్బింగ్ రైట్స్ అన్నీ క‌లిపి అదిరిపోయే రేంజ్ లో హాట్ కేక్ లా అమ్ముడైపోయాయి. ఒక‌టి రెండు కాదు.. ఈ మూడు రైట్స్ క‌లిపి 12 కోట్ల‌కు అమ్మేసారు నిర్మాత‌లు. డిజిట‌ల్ రైట్స్ అమేజాన్ ప్రైమ్ వీడియో.. స్టార్ మా ఛానెల్ శాటిలైట్ రైట్స్ ద‌క్కించుకున్నారు. 

హీరో శ‌ర్వానంద్ కెరీర్ లో భారీ మొత్తానికి అమ్ముడైన సినిమా ఇదే. కోల్ క‌త్తా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ప‌డిప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌రి బ‌డ్జెట్ లో స‌గానికి పైగా కేవ‌లం ఈ రైట్స్ తోనే వ‌స్తే రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ర‌చ్చ ఎలా ఉండ‌బోతుందో..? అయితే డిసెంబ‌ర్ 21నే ప‌డిప‌డి లేచే మ‌న‌సుతో పాటు అంతరిక్షం సినిమా కూడా విడుద‌ల కానుంది. 

More Related Stories