English   

ఇస్మార్ట్ 12 గంటల కీలక ప్రకటన అదే ?

ram
2019-05-26 11:21:27

ఎన‌ర్జిట‌క్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా ఇస్మార్ట్ శంక‌ర్’. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌  మీద ఈ సినిమాని పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సాంగ్స్ చిత్రీకరణకు రెడీ అవుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ సినిమా యూనిట్ నుండి ఒక ప్రకటన వచ్చింది అదేంటంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఒక కీలక ప్రకటన చేస్తామని,  అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్రకటన ఏంటంటే జూలై 12వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుందని. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ పూర్తిగా డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. కాగా ఈ చిత్ర విజయం పూరి, రామ్ కెరీర్స్ కి కీలకం.  

More Related Stories