English   

జయప్రకాష్ రెడ్డి కెరీర్లో టాప్ 12 సినిమాలు ఇవే..

 jayaprakash reddy
2020-09-08 19:38:00

లెజండ్రీ నటుడు జయప్రకాష్ రెడ్డి అకాల మరణం తెలుగు ఇండస్ట్రీనే కాదు యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. గుండెపోటుతో హఠాన్మరణం చెందడం తో ఆయన సహ నటులతో పాటు అభిమానులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే 1988లో బ్రహ్మ పుత్రుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ 32 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 300 సినిమాలు చేశారు జయప్రకాశ్ రెడ్డి. అందులో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు మీకోసం..

1. బ్రహ్మపుత్రుడు: ఒక నటుడికి తొలి సినిమా కంటే ప్రత్యేకమైన చిత్రం మరొకటి ఉండదు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన బ్రహ్మపుత్రుడు సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. నల్గొండలో ఈయన వేసిన ఒక నాటకం చూసి దాసరి అవకాశం ఇచ్చారు.

2. సమరసింహా రెడ్డి: జయప్రకాష్ రెడ్డిని ఎన్ని వందల సినిమాల్లో చూసిన వీర రాఘవ రెడ్డి గానే.  తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా చేరువయ్యారు. సమరసింహారెడ్డిలో ఈయన నటన ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు.

3. ప్రేమించుకుందాం రా: నేను చూసింది రైటా రాంగా.. అంటూ తన పక్కన శ్రీహరిని అడిగే పాత్రలో అద్భుతంగా నటించారు జయప్రకాశ్ రెడ్డి. సీమ ఫ్యాక్షనిజం మొత్తం తన పాత్రలో చూపించారు.

4. జయం మనదేరా: జయప్రకాష్ రెడ్డి 32 ఏళ్ల కెరీర్లో ఒకే ఒక నంది అవార్డు సొంతం చేసుకున్న సినిమా ఇది. ఈ సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా ఆయన బంగారు నంది అందుకున్నారు.

5. జంబలకిడిపంబ: ఈ వీధి సత్యనారాయణ తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ లో చిన్నపిల్లాడి లా ఉండే అద్భుతమైన పాత్రలో కడుపులు చెక్కలు చేశారు జయప్రకాశ్ రెడ్డి.

6. ఎవడి గోల వాడిది: నడుముకు ఒక టవల్ కట్టుకొని ఎవరో తను చంపుతున్నారు అంటూ భయపడే పాత్రలో అద్భుతంగా నటించారు ఈయన. ఎప్పుడు చూసినా కూడా నవ్వు ఆపుకోలేని పాత్ర ఇది.

7. ఆనందం: సినిమా లో ఎంత సేపు మన పాత్ర ఉంది అనేది కాదు.. ఆ చేసిన పాత్ర ఎంత కాలం గుర్తుంటుంది అనేది ముఖ్యం. ఒకే ఒక్క సీన్ లో కనిపించిన కూడా ఆనందంలో జయప్రకాశ్ రెడ్డి చేసిన క్యారెక్టర్ ఎప్పటికీ మర్చిపోలేము.

8. ఢీ: కాళ్లు చేతులు పని చేయవు.. మాటలు రావు.. కేవలం కుర్చీకి పరిమితమయ్యే పాత్ర. అందులో కూడా జీవించారు జయప్రకాష్ రెడ్డి.

9. రెడీ: ఏమి రా పులి.. అంటూ రెడీ సినిమాలో జయప్రకాష్ చేసిన కామెడీ అంత సులభంగా మరిచిపోవడం సాధ్యం కాదు.

10. కిక్: ఇది కూడా ఆనందం తరహా క్యారెక్టర్. కనిపించేది కాసేపైనా గుర్తుకు వచ్చిన ప్రతిసారి నవ్వుకునే పాత్ర ఇది.

11. నాయక్: నేను ఎంత పెడితే అంత తినాలి.. ఏది పెడితే అది తినాలి అంటూ బ్రహ్మానందంతో ఆడుకునే పాత్ర ఎవరు మర్చిపోతారు.. జిలేబి ఏందిరా అంటూ ఆయన మాండలికంలో కళ్ళలో నీళ్ళు వచ్చేంతవరకు నవ్వించారు జయప్రకాష్ రెడ్డి.

12. సరిలేరు నీకెవ్వరు: కూజా లెక్క ఉన్నవ్.. కొడితే శంబు అయిపోతవ్ అంటూ చివరిసారిగా మనల్ని నవ్వించారు జయప్రకాశ్ రెడ్డి. తెరపై ఆయన కనిపించిన చివరి సినిమా ఇది. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా కూడా జయప్రకాష్ రెడ్డి చేసిన పాత్రలు ఎప్పటికీ ఆయనని మన మధ్యే ఉంచుతాయి. 

More Related Stories