English   

ఫిబ్రవరి 12న రాబోతున్న ఉప్పెన

Uppena release
2021-01-26 21:02:33

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా "ఉప్పెన". వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదల చేసిన సినిమా టీజర్ సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ సినిమా హీరోయిన్ క్రితి శెట్టి కి కుర్రకారు ఫిదా అయ్యారు. దాంతో అమ్మడు ఇండస్ట్రీలో ఫుల్ బిజీ గా మారింది. ఇక ఈ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందించాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా మైత్రీమూవీమేకర్స్ ప్రకటించింది. ఫిబ్రవరి 12 న సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

More Related Stories