English   

నలుగురు దర్శకులు..125 కోట్లతో శింబు భారీ బడ్జెట్ సినిమా

Simbu
2021-02-03 15:41:34

ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ హీరోశింబు టైమ్ భాగాలేక కొన్నేళ్లుగా సతమతమవుతున్నాడు. మరోవైపు నిర్మాతలతో విభేదాలు కూడా శింబును తరచూ వార్తల్లో కనిపించేలా చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం శింబు మళ్ళీ ఫామ్ లోకి రావడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడు నటించిన "మానాడు" సినిమాను 125 కోట్లతో నిర్మించారు. అంతే కాకుండా ఈ సినిమాలో నలుగురు దర్శకులు నటించడం విశేషం. సినిమాలో దర్శకులు భారతీ రాజా, చంద్రశేఖర్, ఎస్ జె సూర్య, కరుణాకరన్ సినిమాలో నటిస్తున్నారు. సినిమాను పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. సినిమాలో తమిళనాడు రాజకీయాలను ప్రతిబింబించేలా సన్నివేశాలు ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది.  చిత్రంలో శింబు ముస్లిం గా నటిస్తుండటం విశేషం. వి హౌస్  ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత సురేష్ కమచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా టీజర్ ను ఈరోజు మధ్యాహ్నం 2.34 నిమిషాలకు "క్రాక్" తో సూపర్ హిట్ కొట్టిన రవితేజ చేతుల మీదుగా తెలుగు టీజర్ ను విడుదల చేయనున్నారు.

More Related Stories