మాస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్..జనవరి 13న..

విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. . లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం ఏకంగా 178 నిమిషాలకు పైగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్ తెరుచుకోవడంతో ఇన్నాళ్ళు ఆగిన సినిమాలు ఇప్పుడిప్పుడే థియేటర్స్‌లోకి వస్తున్నాయి. కరోనా కాలంలో విడుదలైన తొలి తెలుగు సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం సరికొత్త రికార్డ్ సాధించింది. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండడం శుభపరిమాణం.