English   

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్

RRR
2021-01-25 15:10:51

రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో , రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో బాలీవుడ్ నటీనటులు అలియా భట్, అజయ్ దేవగన్ సైతం నటిస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా నటిస్తోంది. బాహుబలి విజయం తరవాత రాజమౌళి సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకునట్టు ఇటీవలే రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక తాజాగా చిత్ర బృందం మరో అప్డేట్ ను ఇచ్చింది. ఈ సినిమాను అక్టోబర్న్13 న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. పోస్టర్ లో చరణ్ గుర్రపు స్వారీ చేస్తుండగా..పక్కనే ఎన్టీఆర్ బైక్ పై దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

More Related Stories