English   

మే13న ఆచార్య గ్రాండ్ రిలీజ్

Acharya
2021-01-29 17:49:35

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్  హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాను రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో మెగాస్టార్ తో కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేయబోతోంది. తాజాగా ఈరోజు సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ లో మెగాస్టార్ ఆకట్టుకున్నారు. ప్రజల్లో నుండి వచ్చిన నాయకుడిగా మెగాస్టార్ అలరించారు. టీజర్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇంప్రెసివ్ గా ఉంది.

ఇప్పటికే ఆచార్య టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉండగా తాజగా ఆచార్య మూవీ నుండి చిత్ర యూనిట్ మరో అప్డేట్ ను ఇచ్చింది. సినిమాను మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమా నుండి మెగస్టార్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. పోస్టర్ లో మెగాస్టార్ కుర్ర హీరోలా  కనిపిస్తున్నారు. చేతికి ఎర్ర జండా కట్టుకున్న జనం నాయకుడిలా కనిపిస్తున్నాడు. మరోవైపు విక్టరీ వెంకటేష్ "నారప్ప"సినిమా మే 14 న విడుదల కాబోతోంది. దాంతో ఈ రెండు సినిమాలు పడనున్నాయి.

More Related Stories