మహేష్ బాబు 14వ వివాహ వార్షికోత్సవం.. భార్యకు బహుమతి..

చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా ఉంటాడు కానీ మహేష్ బాబుకు పెళ్లై నిజంగానే 14 ఏళ్లైపోయింది. నమ్మడానికి ఇది కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. 2005 ఫిబ్రవరి 10న వీళ్ల పెళ్లి జరిగింది. అప్పట్లో మహేష్ బాబు పెళ్లి ఓ సంచలనం. చాలా సైలెంట్ గా ఎలాంటి సందడి లేకుండా ఈయన పెళ్లి జరిగింది. అయితే మహేష్ బాబు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. బలవంతంగా నమ్రతతో పెళ్లి చేయించారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా నిలిచిపోయారు ఈ ఇద్దరూ. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మహేష్, నమ్రత జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే వాళ్ల దాంపత్యం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు కూడా అంతే ఆనందంగా ఉన్నారు వాళ్లు. తాజాగా పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతి ఇచ్చాడు సూపర్ స్టార్. నువ్వే నాకు దొరికిన వరం అంటూ చెప్తున్నాడు. ఈ ఇద్దరి ప్రేమ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అంటూ వాళ్లను చూపిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు పిల్లలు.. భార్యతో లైఫ్ ఆనందంగా మార్చేసుకున్నాడు సూపర్ స్టార్. అభిమానులు కూడా ఈయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి కూడా కావాల్సినంత టైమ్ ఇస్తాడు సూపర్ స్టార్.