English   

సినిమా కోసం 14 కిలోలు తగ్గాడట...అలవాటు లేకున్నా తాగాడట !

shahid kapoor lost 14 kg weight for arjun reddy remake of kabir singh movie
2019-04-12 19:10:00

తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్‌ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కబీర్‌ సింగ్‌ టైటిల్‌వ తోనే తెలుగు మాతృకకి దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌ ని కూడా ఆయనే తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తుండగా, షాలిని పాండే పాత్రని కియారా అద్వానీ పోషిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్త్జికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటంటే ఈ సినిమా కోసం షాహిద్‌ 14 కిలోలు తగ్గారట. ఈ విషయాన్ని షాహిద్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సమీర్‌ జౌరా చేబుతున్నారు. 2003లో వచ్చిన ‘ఇష్క్‌ విష్క్’ సినిమా తర్వాత షాహిద్‌ ఓ కాలేజ్‌ కుర్రాడిలా కనిపించడం ఇదే మొదలు అని కఠినంగా డైట్‌ చేయించానని నేను చెప్పినట్టు తూచా తప్పకుండా నా రూల్స్‌ పాటించారు కాబట్టే పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని మలచుకున్నారని అయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో పాత్ర కోసం భాగంగా రోజుకు 20 సిగరెట్లు, మద్యం తాగుతూనే ఉండాల్సి వచ్చేదని నోరంతా విపరీతమైన దుర్వాసన వచ్చేది. షూటింగ్ తరువాత ఇంటికెళ్లి గంటలపాటు స్నానం చేసేవాడినని చెప్పుకొచ్చాడు షాహిద్.

More Related Stories