English   

పవన్ కళ్యాణ్ సినిమాతో 14 కోట్ల నష్టం.. నిర్మాతల ప్రకటన..

pk
2019-09-28 21:14:05

అవును ఇప్పుడు నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాతో తాము 14 కోట్లు నష్టపోయామని ఒక బడా నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ప్రకటన విడుదల చేయడం సంచలనాలు సృష్టిస్తుంది. అయితే అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా కూడా ఆయన నటించింది మాత్రం కాదు. తెలుగులో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన 'అత్తారింటికి దారేది' సినిమాను తమిళంలో 'వందా రాజావాదన్ వరువేన్' పేరుతో శింబు హీరోగా లైకా సంస్థ రీమేక్ చేసింది. సుందర్ సి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన అత్తారింటికి దారేది తమిళ రీమేక్ దారుణంగా పరాజయం పాలైంది. లైకా  ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా నష్టం తీసుకువచ్చింది. అసలే వరస పరాజయాలతో రేసులో పూర్తిగా వెనుకబడిపోయిన శింబుకు అత్తారింటికి దారేది రీమేక్ మరో చేదు జ్ఞాపకంగా మారింది. ఇప్పుడు ఈ సినిమాతో తమ సంస్థకు 14 కోట్ల నష్టం వచ్చినట్టు లైకా సంస్థ అధికారికంగా ప్రకటించడం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. గతంలో ఎన్నడూ ఇలా నష్టాలను అధికారికంగా ప్రకటించని లైకా నష్టాలు అనౌన్స్ చేయడం సంచలనంగా మారుతుంది. పైగా ఈ నిర్మాత కొన్ని నెలలుగా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నాడు అనేది తమిళనాట వినిపిస్తున్న వార్తలు. రజనీకాంత్ 2.0 సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్ హౌస్ దాదాపు 100 కోట్లకు పైగా నష్టపోయింది. ఇదే ప్రభావం మిగిలిన సినిమాల పై కూడా పడుతుంది ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 సినిమాను నిర్మిస్తోంది.

More Related Stories