English   

14 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవి, అనుష్క ఆన్ స్క్రీన్ రొమాన్స్..

chiru
2020-03-17 07:01:43

ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్న జంట.. ఇప్పటికి ఒక్క‌టి కాబోతుందని తెలుస్తోంది.. నిజానికి ఖైదీ నెంబర్ 150 సినిమాలోనే ఆ జంట కలుస్తుందని అందరూ ఊహించారు.. కానీ అనుకోని పరిస్థితుల్లో అది జరగలేదు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో కూడా ఈ జోడి కలుస్తుందేమో అని అంతా ఊహించారు. అప్పుడు కూడా కుదరలేదు. అభిమానులను ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్న జోడి చిరంజీవి, అనుష్క అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ మొదలు కాకముందు ఏ హీరోయిన్ తో నటించాలని కోరుకుంటున్నారు అంటే అనుష్క అని సమాధానం చెప్పాడు మెగాస్టార్. కాకపోతే అప్పుడు ఆమె బాహుబలితో బిజీగా ఉండటంవల్ల డేట్స్ ఇవ్వ‌లేకపోయింది.

ఆ తర్వాత సైరా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో కేవలం కొన్ని నిమిషాలు కనిపించే  ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించింది అనుష్క. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో అనుష్కను తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా నుంచి అనుకోని పరిస్థితుల్లో త్రిష బయటికి వెళ్లిపోవడం.. కాజల్ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను కూడా పక్కన పెట్టడం జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క బెస్ట్ ఆప్షన్  గా నిలిచింది. దర్శకుడు కొరటాల శివ కావడంతో అనుష్క పెద్దగా సమస్యలు కూడా లేవు. వీళ్ళిద్దరూ కలిసి గతంలో మిర్చి సినిమాకు పని చేశారు. ఇప్పుడు చిరంజీవి ఈ సినిమాలో ఈమె నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.14 ఏళ్ల కింద స్టాలిన్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేశారు చిరంజీవి, అనుష్క. ఇన్నాళ్లకు హీరో హీరోయిన్లుగా కలిసి కనిపించబోతున్నారు. మరి ఈ జోడి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

More Related Stories