English   

కరోనా వైరస్ ఎఫెక్ట్.. 14 రోజులు నిర్భంధంలో ప్రియదర్శి.. 

 Priyadarshi
2020-03-17 19:29:30

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ చేస్తున్న అరాచకాలకు హద్దే లేకుండా పోతుంది. ఎక్కడ పడితే అక్కడ.. ఎవరికి పడితే వాళ్లకు ఈ వైరస్ వచ్చేస్తుంది. దాంతో అన్నీ మూసుకుని ఇంట్లోనే కూర్చున్నారు అంతా. ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలతో పాటు మాల్స్, థియేటర్స్ అన్నీ మూసేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్స్ కూడా ఆపేసారు. అయితే అవేం పట్టించుకోకుండా జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు ప్రభాస్ అండ్ టీం. అందులోనే కమెడియన్ ప్రియదర్శి కూడా ఉన్నాడు. కరోనా గిరోనా లేదంటూ ఆయన పోస్ట్ కూడా చేసాడు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏదీ రాదంటూ ట్వీట్ చేసాడు. 

అయితే ఇప్పుడు ఇండియాకు వచ్చిన తర్వాత కరోనా వచ్చిందేమో అనే భయంతో తనను చాలా మంది పలకరించడం కూడా మానేసారని చెబుతున్నాడు ప్రియదర్శి. ఆల్రెడీ ఎయిర్ పోర్టులో ఈయన్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఇంటికి పంపించారు. దాంతో ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించడానికి ఆయన 14 రోజుల పాటు ఇంట్లోనే నిర్భంధం ప్రకటించుకున్నాడు. ఈ రెండు వారాల పాటు తాను అడుగు తీసి బయటపెట్టనని ప్రామిస్ చేసాడు. తనకు కరోనా లేదని నిరూపించుకోడానికి ఇంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదని చెబుతున్నాడు ఈయన. తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు ఇంతకంటే మార్గం తనకు తోచలేదని చెబుతున్నాడు ఈయన. ఏదేమైనా కూడా కరోనా భయం సినిమా వాళ్లలో కూడా ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 

More Related Stories