English   

బోయపాటికి 15 కోట్లా?

Boyapati-Srinu
2018-12-25 19:33:59

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై అప్పుడే విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయ్యింది. హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఏకంగా 25 కోట్లకు అమ్ముడు పోవడంతో పాటు ప్రైమ్‌ వీడియో, ఇతర ఏరియాల డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ద్వారా రికార్డు స్థాయిలో ఈ చిత్రం బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను పారితోషికం కూడా అదే స్థాయిలో ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాకి గాను అటు బోయపాటి ఇటు రామ్ చరణ్ లకు రెమ్యూనరేషన్ పరంగా అల్టిమేట్ ఆఫర్స్ వచ్చాయట. బోయపాటి శ్రీను తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని ఈ సినిమాకి గాను తీసుకున్నాడట. సుమారు 15 కోట్ల రెమ్యూనరేషన్ బోయపాటికి దక్కిందట.

ఇక రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కాకుండా నైజాం హక్కులను రెమ్యూనరేషన్ కింద తీసుకోనున్నాడట. సినిమా క్రేజ్ బట్టి నైజాంలో ఈజీగా 22 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ రావడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత ఆయన బాలయ్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలో బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా'.. 'లెజెండ్' వంటి సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. ఆ రెండు సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని బాలకృష్ణ అభిమానులను బోయపాటి ఖుషీ చేశాడు. బాలకృష్ణ సొంత బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాకి కూడా పారితోషికంగా బోయపాటికి 15 కోట్లు ముడుతున్నాయనేది తాజా సమాచారం. 

బాలకృష్ణతో చేసిన రెండు సినిమాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగిన స్థాయిలో నిలిచేలా బోయపాటి చేశాడు. తరువాత సినిమా వాటిని మించి వుంటుందనే భరోసాను కూడా ఇచ్చాడు. అంతేకాక దీనికి వినయ విదేయకి కూడా అంతే పారితోషకం రావడంతో బోయపాటికి ఈ స్థాయి పారితోషికాన్ని ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు.  బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక చిత్రం యావరేజ్‌గా నిలిచింది. అయినా కూడా 15 కోట్ల పారితోషికం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.

More Related Stories