English   

15 ఏళ్ల తర్వాత మళ్ళీ జంటగా ?

mad
2019-06-16 13:04:05

తమిళంలో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఒకరిద్దరికే ఉండేది, అలాంటి వారిలో మెయిన్ ఇప్పటి సీనియర్ హీరో మాధవన్. సఖి సినిమాతో తెరెంగ్రేతం చేసి మొదటి సినిమాకే ఫిలిం ఫేర్ కొట్టేశారు. ఇక ఆయన సంగతి పక్కనపెడితే సీనియర్ హీరోయిన్ సిమ్రన్ కి కూడా తమిళ నాట మంచి ఇమేజ్ వుంది. ఈ ఇద్దరూ కలిసి 15 ఏళ్ల క్రితం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పరవశం సినిమాలో మొదటిసారిగా నటించారు. ఆ తరువాత మణిరత్నం సినిమాలోను కలిసి నటించిన వీరు మళ్లీ కలిసి నటించింది లేదు. అలా రెండు సినిమాలకే పరిమితం అయిన ఈ జంట మళ్లీ ఇంతకాలానికి మళ్ళీ జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తారని ఎవరూ ఊహించి ఉండరు, కానీ వీరిద్దరూ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ జంటగా కనిపించడానికి సిద్దమవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మాధవన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు మాధవన్ లీడ్ రోల్ లో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ బయోపిక్ తమిళంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్' అనే టైటిల్ తో విడుదలవనున్న ఈ సినిమాలో నంబి నారాయణ పాత్రలో మాధవన్ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో సిమ్రన్ కనిపించనుందట. మాధవన్ మొట్టమొదటగా దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే కావాదం విశేషం. ఇక ఈ సినిమాలో షారుక్, సూర్య అతిథి పాత్రల్లో కనిపించనుండటం విశేషం. దేశద్రోహం నేరం కింద ఇస్రో సైంటిస్ట్ అయిన నంబిని 1994లో అరెస్ట్ చేయడం జరిగింది. తరువాత ఆయన నిర్దోషిగా బయటకు వచ్చి తనను అన్యాయంగా జైలులో పెట్టించిన వారి మీద ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు.

More Related Stories