English   

లాక్ డౌన్ మరో 15 రోజులు పొడిగింపు.. నిర్మాతల గుండెల్లో రైళ్లు..

lockdown
2020-04-12 08:24:40

లాక్ డౌన్ కారణంగా తెలుగు ఇండస్ట్రీ కొన్ని రోజులుగా స్తంభించిపోయింది. ఎటువంటి సినిమా షూటింగులు జరగడం లేదు. సినిమా షూటింగ్స్ ను ఆపేయటం వల్ల దర్శకులకు హీరోలకు ఎలాంటి నష్టం లేదు. మహా అయితే సినిమా విడుదల వాయిదా పడుతుంది. అంతకంటే వాళ్లకు పెద్దగా నష్టం ఏమీ జరగదు. నిర్మాతలకు మాత్రం కొన్ని కోట్ల నష్టం వస్తుంది. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి కావడం లేదు. తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మరో 15 రోజులు ఇలా టైం పీరియడ్ పొడగించారు. దాంతో నిర్మాతలకు కంటి మీద కునుకు కరువైంది. కొన్ని సినిమాలకు విడుదల తేదీలు మారిపోయాయి.. కొన్ని సినిమాలు అసలు విడుదలవుతాయో లేదో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి..

మరికొన్ని సినిమాలు ఓపెనింగ్స్ ఆగిపోయాయి.. ఇంకొన్ని సినిమాలు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి మధ్యలోనే ఆపేశారు.. ఇలా నిర్మాతల కష్టాలు చెప్పుకుంటూపోతే రాస్తే రామాయణం అవుతుంది. అంతగా ఇప్పుడు వాళ్ళ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మరో రెండు నెలల వరకు సినిమా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. దాంతో నిర్మాతల పరిస్థితి తలుచుకుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. సినిమా విడుదల అయినా కాకపోయినా.. షూటింగ్ జరిగినా జరగకపోయినా వాళ్లు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు అయితే కట్టాల్సిందే. దాంతో తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక  అల్లాడిపోతున్నారు నిర్మాతలు.

More Related Stories