English   

అక్టోబర్ 15నుండి థియేటర్లకు అనుమతి

cinema thetares
2020-10-01 08:08:41

కరోనా ఎఫెక్ట్ తో దేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోయింది. గత ఆరు నెలలుగా థియేటర్లలో బొమ్మ పడక యజమానులకు నష్టాలు  నష్టాలు వచ్చాయి. ఇక తాజాగా కేంద్రప్రభుత్వం అన్ లాక్ 5 లో భాగంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. అక్టోబర్ 15నుండి థియేటర్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సినిమా హాళ్లతో పాటూ మల్టీప్లెక్, స్విమ్మింగ్ పూల్స్ కు కూడా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆరు నెలలుగా థియేటర్ లలో బొమ్మ పడకపోవడంతో సినీ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఎంతో మంది కాలక్షేపం కోసం చూసేది సినిమాలే. బాధ వచ్చినా, కష్టం వచ్చినా అది మర్చిపోవడానికి వెళ్ళేది సినిమాకే అంతే కాకుండా వారం మొత్తం పనిచేసి టైంపాస్ కోసం వెళ్ళేది సినిమాలకే దాంతో సినిమాలు లేక ఇన్నిరోజులు మూవీ ప్రియులు బాధపడ్డారు. ఇక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సినిప్రియులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక థియేటర్లో అన్ లాక్ తరవాత ఏ సినిమా పడుతుందో చూడాలి.

More Related Stories