English   

15 కేజీలు తగ్గిన మంచువారబ్బాయి..ఫొటోస్ వైరల్

Manchu Manoj
2020-12-25 15:26:22

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తాజాగా సోషల్ మీడియాలో క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెబుతూ తన ఫోటోలు పోస్ట్ చేసాడు. అయితే మనోజ్ ఈ ఫోటోల్లో షాకింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. మొన్నటి వరకు చబ్బీగా కనిపించిన మనోజ్ ఒక్కసారిగా సన్నబడ్డారు. ఏకంగా ఆయన 15 కేజీలు తగ్గి స్మార్ట్ లుక్ లో మెరిసిపోతున్నాడు. మనోజ్ ఆయుర్వేదిక్ డైట్ మరియు కఠినమైన వ్యాయామం చేసి సన్నబడ్డాడు. ఇదిలా ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ సినిమాకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ గొడవల్లో నుండి భయట పడ్డ మనోజ్ మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెంచాడు. దాంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం మనోజ్ "అహం బ్రహ్మాస్మి" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తవకముందే మరో  రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. అన్ని అనుకున్నట్టు కుదిరితే 2021 లో మూడు సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించనున్నాడు.

More Related Stories