English   

150 కోట్ల వైపుగా ఎఫ్ 2.. కలెక్షన్ల కోసం దిల్ రాజు కొత్త ప్లాన్..

f2
2019-01-26 18:42:11

రెండు వారాలు పూర్తయిన తర్వాత కూడా ఎఫ్ 2 జోరు తగ్గడం లేదు. ఇప్పటికీ ప్రతి థియేటర్ హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఈ విజయాన్ని చూసి చిత్ర యూనిట్ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలైన ఇప్పటికే దాదాపు 120 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. 150 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా చూస్తుంటే ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తుండటంతో దర్శక నిర్మాతలు మరో ప్లాన్ వేశారు. సినిమాలో దాదాపు తొమ్మిది నిమిషాలు జత చేయబోతున్నారు. జనవరి 26 నుంచి ఈ కొత్త సీన్లు థియేటర్లలో కనిపించబోతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు సన్నివేశాలు కొత్తగా నవ్వించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మూడో వారంలో కూడా కలెక్షన్లు పెంచుకోవడానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పటికే రెండున్నర గంటల సినిమా ఉన్న మరో పది నిమిషాలు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. దీని వల్ల కచ్చితంగా రెండోసారి రావాలనుకున్న ఆడియన్స్ కు మరింత ప్లస్ కానుంది. 150 కోట్ల క్లబ్బులో చేర్పించడానికి దిల్ రాజు వేసిన మాస్టర్ ప్లాన్. ఇది ఈయన గతంలో కూడా తన సినిమాలకు కొత్త సీన్లు యాడ్ చేసి కలెక్షన్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.. మొత్తానికి మరి దిల్ రాజు వేసిన మాస్టర్ ప్లాన్ తో 150 కోట్ల క్లబ్ లో అడుగు పెడుతుందో లేదో చూడాలి.

More Related Stories