1500 కోట్లతో రామాయణం...అల్లు అరవింద్ సాహసం

భారత సినీ రంగంలో మరో భారీ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. మన నిర్మాత అల్లు అరవింద్, ఆర్జీవీ స్నేహితుడు మధు మంతెన, నమిత్ మల్హోత్రా అనే మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి రామాయణం సినిమాను 3డిలో నిర్మించడానికి సిద్ధమవుతున్నాడని ప్రకటించారు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్. మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. దీని కోసం ఏకంగా 1500 కోట్లకు పైగానే ఖర్చు చేయబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు కూడా తెప్పించబోతున్నారని అంటున్నారు. అంతేకాక ఈ సినిమా మొత్తం 3డిలోనే షూట్ చేయబోతున్నారట. నిజానికి 2.0 తర్వాత 3డిలో షూట్ చేయబోతున్న రెండో ఇండియన్ సినిమా ఇదేనని చెప్పొచ్చు. దంగల్ నిమా తెరకెక్కించిన నితీష్ తివారితో పాటు శ్రీదేవి ఆఖరి చిత్రం మామ్ సినిమాని తెరకెక్కించిన రవి ఉద్యావర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.