English   

మెగాస్టార్ చిరంజీవి 152వ ఎలా ఉండబోతుందో తెలుసా..

  Chiranjeevi
2019-09-28 13:37:59

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా పనులతో బిజీగా ఉన్నాడు. ఇది మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తెలుగు, హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో సైరా విడుదల కానుంది. కచ్చితంగా ఈ చిత్రంతో సంచలనం సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నాడు మెగాస్టార్. సైరా తర్వాత ఈయన కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. సందేశానికి కమర్షియాలిటీ జోడించి వరస విజయాలు అందుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు చిరు కోసం పర్ఫెక్ట్ మెసేజ్ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేసాడు కొరటాల. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ తో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఇందులో అనుష్క, శ్రద్ధా శ్రీనాథ్, హ్యూమా ఖురేషిలలో ఎవరో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్స్ అయితేనే ఇప్పుడు చిరుకు పర్ఫెక్ట్ జోడీ అవుతారు. అందుకే త్రిష పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు త్రిష ఫామ్ లో లేకపోవడంతో మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఈ సినిమాకు కొరటాల ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 
 

More Related Stories