English   

మాట‌ల మాంత్రికుడితో చిరంజీవి సినిమా.. 153 క‌న్ఫ‌ర్మ్..

Chiranjeevi   announces film with Trivikram  srinivas
2018-12-28 02:19:45

ఇంతకీ చిరంజీవి ఎన్ని సినిమాలు చేస్తున్నాడు.. సగటు సినిమా ప్రేక్షకుడికి వస్తున్న అనుమానం ఇదే. పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అన్నయ్య ఖైదీ నెంబర్ 150తో ఇంకా ఉన్నాన‌ని గుర్తు చేసాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలకు తెరదించుతూ సైరా సినిమాతో బిజీ అయ్యాడు మెగాస్టార్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు క‌మిట్ అయ్యాడు చిరంజీవి. ఇప్పటికే కొరటాల శివ మెగాస్టార్ కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తన కొనిదెల బ్యానర్ పైనే నిర్మించ‌నున్నాడు. కొరటాల సినిమా తర్వాత బోయపాటి కూడా కథ పట్టుకొని సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఈయన త్వరలోనే బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత కానీ చిరంజీవి కథ పై దృష్టి పెట్ట‌డు బోయపాటి శ్రీను. అంతలోనే ఇప్పుడు చిరంజీవి ఖాతాలో మరో దర్శకుడు చేరిపోయాడు. ఆయ‌నే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయ‌న‌తో చిరంజీవి 153వ సినిమా ఉండబోతుంది. ఈ విషయం చెప్పింది కూడా మరెవరో కాదు.. స్వయంగా మెగాస్టార్. తమ కాంబినేషన్ కలిపింది రామ్ చరణ్ అంటూ అభిమానుల ముందు అసలు విషయం చెప్పాడు చిరంజీవి. అందుకే తనయుడికి థాంక్స్ కూడా చెప్పాడు చిరు. తనకు మంచి దర్శకున్ని త‌న‌యుడు ఇచ్చాడ‌ని మురిసిపోయాడు ఈ హీరో. వచ్చే ఏడాది చివర్లో త్రివిక్రమ్- చిరంజీవి సినిమా ప‌ట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించబోతున్నారు. మొత్తానికి ప‌దేళ్ల గ్యాప్ ఇలా వరస సినిమాలు చేస్తూ ఆ లోటు ఇలా భ‌ర్తీ చేస్తున్నాడు మెగాస్టార్.

More Related Stories